పుట:Adhunikarajyanga025633mbp.pdf/42

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రజానాయకులు తమస్వలాభమును, స్వప్రతిభనే కాంక్షించి ప్రజలవర్తనము గూర్చి శ్రద్ధవహింపనిచో తాము అవనీతిపరులై,

ప్రజానా
యకులు.

మతమందు దేవునియం ద్రశద్ధ వహించి, నైతికప్రవర్తనమును దూరమొనర్చి అక్రమవర్తనులై, ఒకరినొకరు అసభ్యముగా విమర్శించుకొనువారైన ప్రజలు అక్రమవర్తనులగుదురు. విశ్వవిద్యాలయములు, మతప్రవక్తలు, సాంఘిక సేవకులు, ఆటపాటలయోధులు, వివిధసంస్థల కార్యనిర్వహకులు తమ సత్ప్రవర్తనముచేత, తమ ధర్మకార్యచింతనమువలన, ప్రజాక్షేమచింతనముద్వారా రాచకీయనాయకులపై తగు ప్రతిష్టబొంది ప్రజలను, రాచకీయనాయకులను సన్మార్గాను వర్తుల జేయుటగత్యము. రాజకీయనాయకులును సుశిక్షితులై, విజ్ఞానులై, శాంతులై, దాంతులై, తమవర్తనములచే ప్రజల సన్మార్గానువర్తనులజేయు కుతూహలు లైననే ప్రజాస్వామిక రాజ్యము జయప్రదము కాగలదు. అమెరికాయందు ప్రజలెల్లరకు రాజకీయనాయకులన్న అగౌరవము మెండైనది. "యధారాజా, తధాప్రజా" యనునట్లు ప్రజలయందు ఆత్మగౌరవము లోపించుచున్నదన్న ఆశ్చర్యమేమి? రోమనుప్రజాస్వామికము, ఏధన్సుప్రజాస్వామికము తుదకీనాటి ఇటలీప్రజాస్వామికము, దక్షిణఅమెరికా రాష్ట్రములందలి ప్రజాస్వామికములు అపజయమందుటకీ ప్రజానా