పుట:Adhunikarajyanga025633mbp.pdf/41

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


రాచకీయ ప్రణాళికల ప్రాపకమునకై వివాదపడుటకు సంసిద్ధులు కానిచో రాచకీయశాంతి లభ్యముకాదు. రాచకీయకక్షలు సత్యమార్గమున ప్రజాశ్రేయమునకై సాధ్యముకాదగు సంస్కరణలనిమిత్తమై ప్రజాస్వామిక రాజ్యాంగముయొక్క క్షేమము నపేక్షించుచు తమధర్మమును నిర్వర్తించుచుండవలెను. ఈ కక్షలయొక్క నాయకులు పరస్పరముగా తమయొక్క దేశప్రేమ ప్రజాసేవాభిలాష, స్వార్థరాహిత్యత శక్తిసామర్థ్యములగురించి సందేహపడు దుస్థితికి రాకూడదు. రాచకీయకక్షలు తమశక్తియుక్తుల నన్నిటి ప్రజలందరికి రాచకీయవిజ్ఞానము గల్గించుటకు, రాజకీయసమర్ధతను హెచ్చుచేయుటకు, యుక్తాయుక్తవిచక్షణముల పెంపొందించుటకు యుపయోగించవలయును. కాని అమెరికాయందలి పార్టీలవలన హెచ్చుగా ప్రజలు తప్పుదారులు ద్రొక్కుచుండుటయు, జర్మనీయందు ప్రజలు విప్లవకారులగుటకు కమ్యూనిస్టులు నాజీలు ప్రోత్సహించుచుండుటయు, ఇటలీయందు ఫాసిస్టులు నిరంకుశపాలనమును ప్రేమించుటయు, తదితరదేశములందు, ప్రజలను నైతికరహిత మార్గములందు దింపుచుండుటయు జరుగుచున్నది. రాచకీయకక్ష లిట్లు అక్రమవర్తనమందున్న ప్రజల సత్ప్రవర్తకులజేయనంతకాలము ప్రజాస్వామిక రాజ్యము యొక్క పునాదులు సన్నగిల్లుచుండును.