పుట:Adhunikarajyanga025633mbp.pdf/40

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గవలెను. పాఠశాలలన్నిటియందును, రాజ్యాంగ సూత్రముల గురించి, పౌరుల హక్కు బాధ్యతలగూర్చి తగినంత బోధచేయవలెను. వోటుపొందు ప్రతివారికి పౌరసత్వపు హక్కు, బాధ్యతలగూర్చి బోధచేయవలెను.

స్థానిక స్వపరి
పాలనము

రాజకీయ సంస్థలద్వారా, ప్రజలచే స్వరక్షణాబివృద్ధికై యేర్పరుపబడు సంస్థలద్వారా ప్రజలకు రాచకీయానుభవము కల్గించుట ప్రజాస్వామిక రాజ్యాంగాభివృద్ధికారకమని ఇంకను అనేకులు గ్రహించుట లేదు. ఫ్రాన్సునందు స్త్రీలకు వోటుహక్కు --------డుటయేకాక స్థానికస్వపరిపాలనా సంస్థలను నిస్సారములై యుండుట విషాదకరము. అమెరికాయందు స్థానిక స్వపరిపాలనాసంస్థలు పార్టీనాయకులచే నిరుపయోగ మొదించుండుటయు, జర్మనీ, ఇటలీదేశములందలి యధికారశూన్యములై యుండుటయు నష్టదాయకము. ఇంగ్లండునం దీనివయమున చాలవరకు సంతృప్తికరముగా ప్రజలకు రాచకీయానుభవము సంపాద్యమగుట కవకాశములు కల్గింపబడుచున్నవి.

రాజకీయ
పార్టీలు

ఇన్ని యున్నను ప్రజలయందు ప్రబలియుండు రాచకీయ కక్షలు అపరిమితమైయున్న గాని, వానినాయకులు తాముపట్టిన కుందేలునకు మూడే కాళ్లను మొండివారలైన కాని ఒక్కరితో నొక్కరు వివిధపక్షీయులు సామరస్యత వహించి స్నేహభావముననే తమ తమ