పుట:Adhunikarajyanga025633mbp.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

17

6. ప్రజాస్వామిక రాజ్యాంగము ప్రసిద్ధిబొంది ప్రజలందరి క్షేమమునకే యుపయోగపడ వలెనన్న, ప్రజలెల్లరు తమరాజ్యాధికారము యొక్క విలువను గ్రహించి తమ రాజ్యము

విద్య:-

జయప్రదముగా పరిణమించవలెనని కుతూహలపడుచుండవలెను. ఇందులకు తగుశిక్షణ నిచ్చుట రాజ్యాంగముయొక్క ఎధయై యున్నది. శ్రీప్లేటో గారు, పిమ్మట శ్రీఅరిస్టాటిలుగారు వాదించినట్లు అజ్ఞానులగువారు, అశ్రద్ధులగువారును, స్వతంత్రాలోచనము చేయజాలని వారును అందుల కవకాశము లేని వారును తమరాజ్యాధికారమును, దుర్వినియోగము జేయుట తధ్యమని ఈకాలపు ప్రజాస్వామిక రాజ్యాంగముల యుదంతములు చెప్పుచునే యున్నవి. ఈ రహస్యము నెల్లరీ కాలమున తగినంతగా గ్రహించకపోవుట విచారకరము. ప్రాధమికవిద్యను ఎల్లరకు ప్రసాదించినంత మాత్రమున చాలదనియు, యౌవనులకు ఉన్నత రాజకీయ విద్యకల్గించుట గత్యమనియు వోటరులైన వారికి ఎల్లప్పుడు రాజ్యాంగపు మంచి చెడ్డలగురించి సత్యస్వరూపము నారాధించు వారిపాలన బోధజేయించు టవసరమనియు, ఈనాటికిని ప్రజాసామాన్యము గ్రహించకుండుట ప్రజాస్వామికమునకు నష్టదాయకముగా నున్నది. జర్మను దేశమునందువలెనే ప్రతివిద్యార్థికి వారిదేశపు రాజ్యాంగ చట్టపు ప్రతినొసంగవలెను. అంతియేకాక నానా జాతి సమితియొక్క చట్టపు ప్రతికూడ ప్రతివిద్యార్థికి నొసం