పుట:Adhunikarajyanga025633mbp.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

కైన సమాననైతిక సాంఘికసాంప్రదాయముల బొందుటకు వలయు విద్యాప్రదానమొనర్చుట శాంతిరక్షణకు పయోగము. స్విట్జర్లండునందు, ఇటాలియను, జర్మను, ఫ్రెంచిజాతులకు జెంది, ఆయాభాషలనేకల్గి, ఆయాసాంప్రదాయములనే అనుభవించుచు ప్రజలున్నను, ఆదేశపు రాజ్యవిధానము ద్వారా వారెల్లరు, తప్పనిసరిగా కొంతసమానమగు విజ్ఞానమును, నైతికాచారములను, రాజకీయనైపుణ్యతనుబొంది, పరస్పరముగా సోదరభావమును పెంపొందించుకొనుచున్నారు. అమెరికా సంయుక్తరాష్ట్రములందిట్లే ఎన్నోజాతులకు జెందిన ప్రజలున్నను, వారికందరి కొకేవిధమగు సామాన్యరాజకీయ లక్షణముల కల్గించు విద్యావ్యాసంగము కల్గించక, ఎల్లప్పుడు అశాంతిప్రజలయందు ప్రబలుచున్నది. బాల్కను రాష్ట్రములందలి యీ విభేదములు ప్రజాస్వామికమునకు -----ములగునను భయము నానాజాతిసమితివారికి కట్టుబడి, ఆరాజ్యములకు ప్రజాస్వామిక స్వాతంత్ర్యము ప్రసాదించునప్పుడే అచ్చటి అల్పసంఖ్యాకులగు మతస్థులకు, జాతీయులకు, భాషల ముచ్చటించువారికి, తదితరులతోపాటు సమానరాజకీయ సాంఘికనైతికహక్కులు, సావకాశములు సంప్రాప్తమగుటకై "అల్పసంఖ్యాకుల రక్షణపు టొడంబడిక" లేర్పరచబడెను.