పుట:Adhunikarajyanga025633mbp.pdf/37

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


15

కాలము, ప్రజాస్వామికమేర్పడినను, చిరస్థాయియై యుండునని చెప్పతరము కాదు. బాల్కనురాష్ట్రమునందిప్పటికిని రాజకీయాందోళన భయంకరరూపముదాల్చుచుండుటకు ముఖ్య కారణములలో నొక్కటి యీమతకలహములే! నూతనభావోదయయుగమునుండి యిప్పటివరకు, ప్రజాస్వామిక రాజ్యాంగము పొందగల్గిన ప్రతిప్రధానదేశమందును, సర్వమతసామరస్యమును ఏర్పరచుటకు రాజకీయజ్ఞులు ప్రయత్నించి, జయప్రదులగుచున్నారు.

సమానమగు
హక్కు
బాధ్యతలు

5. మతసామరస్యమువలెనే, సంఘసామరస్యము నెలకొనుటవసరము. దక్షిణ అమెరికాదేశమందు, నీగ్రోలను తెల్లవారు హింసించురీతియు, దక్షిణ ఆఫ్రికాఖండమందువలె ఆఫ్రికాయంతట తెల్లవారు నీగ్రోవారిని సంఘ బాహ్యులుగ పరిగణించుటయు, మనదేశమందు ప్రజలలో ఆరవవంతు వారి నంటరాని వారుగా జూచుటయు, రాజకీయశాంతికి, ప్రజాస్వామికముయొక్క భద్రతకు దోహదముకాజాలదు. ఫ్రెంచివారివలె వివిధజాతులపై ఆదరణకల్గియుండుట, భారతీయులవలె వివిధజాతుల నైతిక బాగ్యమును సురక్షితపరచుట, రాజకీయ శాంతికి లాభకరము. వివిధజాతులకుజెందిన, వివిధభాషలకుజెందిన, వివిధనైతిక సాంప్రదాయముల కలవాటుపడిన ప్రజలయందు కల్గుచున్న, అంతస్థులవారీ భేదముతగ్గించి, అందరు కొంతవఱ