పుట:Adhunikarajyanga025633mbp.pdf/36

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ప్రచారితమైయున్న భాగ్యవిభజనపద్ధతి ప్రజాసామాన్యమునకు అసంతృప్తికరముగా నుండుటచే ఆపద్దతిని విప్లవము ద్వారానే రూపుమాపుటకు, రషియా దేశపు బోల్షి విక్కుల ననుకరింపగోరు సమిష్టివాదు లుత్సాహపడుచుండుటచే అనేకదేశములందు ప్రజాస్వామిక రాజ్యాంగమున కాపద తటస్థించుచున్నది. ఈసమిష్టివాదుల ప్రాపకమును, వారిచే ప్రచారితమగుచున్న విప్లవమును ఆపుటకై జాతీయవాదులు ఫాసిస్టులను పేరున ఇటలీయందును, నాజీలను పేర జర్మనీ యందును నిరంకుశరాజ్యపాలన మేర్పరుప పట్టుదల కలిగి యున్నారు.

మతసామ
రస్యము

4. ప్రజలయందు మతసంబంధమగు ప్రబలతరమైన వివాదములున్నను, ప్రజాస్వామికము భంగమొందవచ్చును. రోమను కేథలిక్కులు ప్రోబస్టెంటు మతస్థుల జూచిగాని, మహమ్మదీయులు హిందువుల జూచిగాని సహనముబొందకున్నచో, చీటికిమాటికి వివాదములు తటస్థించును. ఈమతసంబంధమగు అసహనత తీవ్రరూపముదాల్చుచో, విప్లవములు కల్గుటదుస్తరము కాదు. ఐరిషుఫ్రీస్టేటునందు, రోమను కాథలిక్కులు ప్రోటస్టెంటు మతస్థుల ననేకరీతుల విసిగించుచుండుట రాజకీయశాంతికి సానుకూల్యము కాజాలదు. మన దేశమం దిప్పటివలెనే, హిందూ-మహమ్మదీయులు, పరస్పరముగా ద్వేషించుకొనుచున్నంత