పుట:Adhunikarajyanga025633mbp.pdf/34

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


యునన్నచో భగవంతునిసేవకై భక్తులుశుచి నెట్లు బొందవలయునో అటులనే ప్రజలును తగుశిక్షణమును, జాగ్రత్తను, స్వరక్షణసూత్రజ్ఞానమును ఎల్లప్పుడును పొందవలసి యున్నది. అప్పుడే ప్రజాస్వామిక రాజ్యాంగము జయప్రదమగును. అప్పుడే దానివలన ప్రజలందరకు సౌభాగ్యసంసిద్ధియగును. ప్రజలు రాజమాన్యులగుటయేకాక, రాజాంశ సంభూతులగుటయేకాక రాజత్వమును సంపూర్ణముగా బొందగలరు.

దాస్యము
కూడదు

ప్రజలు తమ రాజ్యమును సంతృప్తికరముగా తమక్రమాభివృద్ధికొరకై నడపుకొనుశక్తి బొందవలయునన్న ప్రథమమున వారిలో నెవ్వరును మనుష్యమాత్రులకగత్యమగు స్వతంత్ర బాసి, బానిసలై యుండరాదు. (2) వారందరు భానిసత్వమునకు దూరులై స్వతంత్రులైయున్నను, సాంఘికదాస్యమునకు, మతదాస్యమునకు, ఆర్ధికదాస్యమునకు లోబడకుండ నుండవలయును. మనపంచములు, అమెరికావారి నీగ్రోలు, దక్షిణాఫ్రికావారినీగ్రోలు, భారతీయులు, తమ యిప్పటి దుస్థితి యందు మ్రగ్గుచుండుట తప్పు. (3) సాంఘీకార్ధికమతస్వాతంత్ర్యము సాధారణవిషయములయందు సంప్రాప్తించినను, ప్రజలెల్లరు తమయనుదిన జీవనాధారమునకు వలయు ధనసంపాదశక్తిని బొందియుండు టగత్యము. "రేపటికెట్లోగదా జీవించుట" యను విచారమునకు ప్రజలు లోనగునంతవరకు,