పుట:Adhunikarajyanga025633mbp.pdf/338

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మునకు, దేశీయ ఆర్ధిక ప్రపంచపు ఆలోచనలు, అవసరముల గూర్చి తెల్పుటకును, ప్రభుత్వపు వ్యవహారముల విమర్శించి, మంచిచెడ్డల తెలుసుకొనుట కవకాశము కల్గుచున్నది.

దురదృష్టవశాత్తు, శాసననిర్మాణమందు కాని, బడ్జెట్టును తయారుచేయుటలో కాని, మంత్రాంగవర్గము నేర్పరచుటలో కాని, ఈసభవారికి, ప్రజాప్రతినిధిసభ వారితో పాటు, కొంతవరకైన సమానప్రతిపత్తికలుగ కుండుటచే, జర్మనీ వారి రాజ్యాంగమం దత్యంత హీనస్థానము నలకరించు చున్నది. క్రిందటి ఐదుఆరువత్సరములనుండి, ఈసభ సమకూడుటయే లేదన్న ఆశ్చర్యము లేదు. కాని, భవిష్యత్తునందు, ప్రజాస్వామిక రాజ్యాంగము వివిధదేశములందు జయమంది, కార్మికులకు సంతృప్తికల్గించి, అన్ని పార్టీలను సక్రమ రాజ్యాంగ పధమందుంచవలయునన్న, "వస్తునిర్మాతకుల సభ"కు ఇప్పుడు సెనెటుసభకంటె హెచ్చు ప్రాముఖ్యత, అధికారము సంప్రాప్తమగుట అత్యవసరము. ప్రజాసామాన్యమునకు తగు ప్రాతినిధ్యము కల్గిననే, రాజ్యాంగము సురక్షితమగును. "వస్తునిర్మాతకుల శాసనసభ" ఇప్పటి భాగ్యవిభజనపద్ధతికి భంగముకల్గించకుండ ప్రజాస్వామికమును ప్రజలకు ప్రీతికరమొనర్చుట కుపయోగపడును._________________