పుట:Adhunikarajyanga025633mbp.pdf/337

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ముతో రైష్‌టాగ్ అను ప్రజాప్రతినిధిసభయందు ప్రవేశపెట్టవలెను. "ఆర్థిక శాసనసభాచర్చలయం దెట్లు మంత్రులుపన్యసించి మంత్రివర్గమువారి అభిప్రాయములతెలుప నగునో, అటులనే ప్రజాప్రతినిధిసభయందు తమ బిల్లు చర్చింపబడునప్పుడు తమ యాశయముల తెలుపుటకై "ఆర్థిక శాసనసభవారు" తమ ప్రతినిధులను పంపించవచ్చును. ఇటులనే, ప్రజాప్రతినిధి సభవారిచే అంగీకృతమున బిల్లులను ఈసభ వారికి చర్చకొరకై నివేదించవలసియున్నది. కాని ప్రజాప్రతినిధిసభ వారి యంగీకార అనంగీకరములపై, ప్రతిబిల్లు యొక్క అదృష్టము, దురదృష్టము ఆధారపడియున్నవి. బడ్జెట్టు బిల్లు, ఆర్ధిక శాసనసభ వారికి నివేదింపబడుట లేదు. కనుక, జర్మను రాజ్యాంగ విధానమం దీసభ కింకను, తుదకు "రైషులైరు" అను సెనెటుసభకున్న ప్రాముఖ్యతకూడ కల్గుట లేదు.

ఐనను, ఈసభ వారి వివిధస్థాయి సంఘములు, ప్రభుత్వపు వివిధ వ్యవహారముల పరీక్షించుటకు మంత్రులు, తదితర ప్రభుత్వోద్యోగుల, తమకు సలహా నిచ్చుటకు, భోగట్టా తెల్పుటకై పిలిపించుట కధికారముకలదు. అవసరమగు ప్రభుత్వ సమాచారములు చర్చల గురించి తగు రిపోర్టులను, మంత్రివర్గముద్వారా వీరు తెప్పించనగును. ఈవిధముగా, కార్మిక ప్రతినిధులు, యజమానుల ప్రతినిధులును, ప్రభుత్వ