పుట:Adhunikarajyanga025633mbp.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మును బొందవచ్చును. కనుక ప్రజాస్వామిక రాజ్యాంగము అన్నియెడల, ఎల్లకాలములందు వివిధనాగరికతాసోపానము లందలరారుచుండుప్రజల కొకేవిధమగు సుఖసౌఖ్యముల ప్రసాదింపజాలదు. ప్రజలబట్టియు, వారి వంశక్రమానుగతముగా అనుభవ ప్రాప్తమగు బుద్ధిఫొకడల నడతల బట్టియు వారివారి దేశముల సాంఘికార్ధిక పరిస్థితులననుసరించియు తన శక్తిసామర్థ్యముల ప్రజాస్వామిక రాజ్యాంగము జూపెట్టకల్గును. అయ్యది ఆదిశక్తివంటిది. రక్తపిసాసులగు అడవిజాతుల వారికి భీకరాకృతమై, రక్తమునుపీల్చి జీవించు మహాకాళివలె ప్రత్యక్షమగును. కాని, అహింసాపరులై మానవకళ్యాణము గోరు శాంత హృదయులైన పుణ్యాత్ములకు ప్రేమావతారమగు, లోకకళ్యాణప్రదమగు, శాంతిదాయకమగు, లోకమాతవలె, శక్తిమూర్తియై ప్రత్యక్షమగును. ప్రజలందరిని స్వవృద్ధికాక్షించువారిగను, మానవాభ్యుదయతత్పరులగనుజేసి మానవులందంతర్గర్భితమగు ఈశ్వరుని ప్రీత్యర్థమై కళాప్రపూర్ణులుగా, తేజోమయులుగా జేయుటకై ప్రజాస్వామిక రాజ్యాంగము తదితర రాజ్యాంగ విధానములకంటె యుపయోగపడుననియే రాచకీయజ్ఞులయొక్కయు, తత్వవేత్తలయొక్కయు విశ్వాసమైయున్నది. ఈనమ్మిక ప్రపంచమందలి ప్రజాసామాన్యము నావహించుటవలననే ప్రజాస్వామ్యపు రాజ్యాంగము లెల్లడ నంగీకరించబడుచుండెను. కాని, ఈరాజ్యాంగము ప్రజలయీప్సితార్ధముల నీడేర్పవల