పుట:Adhunikarajyanga025633mbp.pdf/328

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఖర్చిడుకొననగునో నిర్ణయించుననియు, సాంఘిక వాదులు చెప్పుచున్నారు. ఈసభలద్వారా దేశాంతర్గతమగు వ్యవహారములన్నియు చక్కబెట్టబడుచు వీనికిమించిన విదేశాంగ వ్యవహారములు, రక్షణదళమున నిర్వహణము, దేశీయపుశాంతి రక్షణ ఆదిగాగల కార్యములకై మరొక శాసనసభ నేర్పరచుటకు బదులు "భోక్తలశాసనసభ"నే నియమించుటమంచిదని వారివాదము. ప్రధమసభయందు వివిధవృత్తులందలి ప్రజలు ప్రాతినిధ్యము బొందెదరు. రెండవసభకు దేశమందలి ప్రజలెల్లరు ఇప్పటివలెనే వివిధ నియోజకవర్గములనుండి తమ ప్రతినిధుల పంపెదరు.

కాని, ప్రస్తుతపు పరిస్థితులందు, యజమానులు కార్మికులు ప్రతివర్తకమందును, వాణిజ్యమందును కలరు గనుక, యజమానులను పూర్తిగా పదభ్రష్టుల నొనర్చిననగాని "వస్తునిర్మాతకులశాసనసభ" యందు కార్మికులకే ప్రాతినిధ్యత యిచ్చుట సాధ్యపడదు. ఒక వేళ నానాజాతి కార్మికసంఘము (జనీవాయందున్నది) నందువలెనే యజమానులకును, కార్మికులకును, ప్రతివృత్తియందును సమాన ప్రాతినిధ్యమునే యిచ్చి, ఆయిరుపక్షముల ప్రతినిధులకు ఆశాసనసభయందు తావొసంగుట న్యాయమని సాంఘిక వాదులు చెప్పుచున్నారు. అప్పుడైనను వివిధవృత్తులకు పరస్పరముగా ఎంతెంత ప్రాతినిధ్యమివ్వవలెనో ఎవ్వరు తేల్చుట? ఒకప్పుడొకవృత్తి అత్యం