పుట:Adhunikarajyanga025633mbp.pdf/322

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


న్నవి. మరియు, పార్టీలపైననే, అభ్యర్ధులజాబితా తయారుచేయు బాధ్యత యుండుటవలన, అభ్యర్ధులను ప్రత్యేకముగా స్థానిక పౌరులు వేధించుట కవకాశము కలుగుట లేదు.

మరియు తమప్రభుత్వము అధర్మపథానువర్తి యగుచొ, ఆయధర్మచర్యల ధిక్కరించుటకు పౌరులెల్లరు సంసిద్ధులై యుండవలెను. వారిరాచకీయపార్టీలు, సంస్థలు, ప్రతినిధులు, వారి యీధర్మమును వారు సక్రమముగా నిర్వర్తించుటకు సాయపడవలయును. ఈవిధముగా తమపౌరసత్వపు ధర్మమును నిర్వర్తింప దలచుటచేతనే, పోలండు, జుగోస్లావియా, ఇటలీ దేశస్థులనేకులు కారాగారములందు మ్రగ్గుచున్నారు. కొందరు నాయకులు వలసపోయినారు. కనుకనే రషియా రాజ్యాంగ నిర్మాతలలో ప్రధానులగు, శ్రీట్రాట్క్సీగారు, టర్కీయందు తలదాచుకొనవలసివచ్చినది. అటులనే మనదేశమందును, లక్షలమంది దేశభక్తులు కారాగారములందు స్వాతంత్ర్య జపము జేయుచున్నారు.

స్థానికావసరములను గురించి, ప్రభుత్వము అశ్రద్ధచేయకుండుటకై, పౌరులు, తమతమ రాచకీయపార్టీలద్వారా, వివిధజిల్లాలయొక్క ప్రత్యేకావసరముల దీర్చుట, ఎట్లు దేశమునకు క్షేమకరమో నిరూపించుచుండుట మేలు. ముందు తమపార్టీలద్వారాను, పిమ్మట, శాసనసభలయందును, దేశీయు లెల్లరి ప్రతినిధుల చేతను, తమతమ స్థానికావసరముల