పుట:Adhunikarajyanga025633mbp.pdf/321

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రాదు. అటులనే, పౌరులును, తమవోటుహక్కు నుపయోగించుటద్వారా, స్వార్ధలాభము నపేక్షింపరాదు. తమనియోజక వర్గమునకుగాని, అందలి మరియేభాగమునకుగాని, దేశమునకు అవసరముకానంతవర కేలాంటి ప్రత్యేకలాభముల కల్గించవలెనని, తమ అభ్యర్ధులగాని, పిమ్మట సభ్యులగాని కోరరాదు. దేశావసరములబట్టియే, తమనియోజకవర్గములకు ప్రత్యేకలాభముల చేకూర్చుటగత్యమైనచో, తమసభ్యు లెట్లైనను, వారిశక్తికొలది కృషిచేయుదురు. ఫ్రాన్సు, అమెరికా, మనదేశమందు ఇట్లుగాక, పౌరులనేకులు, తమకనేక వ్యక్తిగతమగు స్థానికమగులాభముల, వారిరాజ్యాధికారముద్వారా, కల్గించవలెనని, తమసభ్యులు వేధించుట అనుభవసిద్ధము. ఈదేశములందలి శాసనసభాసభ్యులును, తమధర్మముల మరచిగాని, వోటరులపోరు పడజాలకగాని, తిరిగి ఎన్నికలందు జయమాశించిగాని, తమతమ నియోజక వర్గములయొక్క ప్రత్యేక అజాతీయమగు లాభములకల్పించ ప్రయత్నింతురు. ఇందువలన, వారు మంత్రులను, వారి ఉద్యోగులను సంతుష్టులజేయుటకై, తమరాచకీయపార్టీలయెడ విద్రోహము జేయుచు, తమస్వాతంత్ర్యము నుపయోగించుకొనక, ప్రభుత్వచర్యల నిర్మొఖమాటముగా విమర్శించక, నిరుపయోగులు కావలసివచ్చును. కనుకనే, జర్మనీయందలి విశాలమగు నియోజకవర్గములు, ఈలాంటి యిబ్బందుల తొలగించుచు