పుట:Adhunikarajyanga025633mbp.pdf/320

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రాజ్యాంగ వివరముల చర్చించుటందు స్వతంత్రత ఇప్పుడు పొందగల్గుచుండు వారిపై నిర్బంధము హెచ్చగును. కనుక, రాచకీయపార్టీల మార్చిన సభ్యులవిషయమున, వారి వారి నియోజక వర్గము లందలి వోటర్లలో నాల్గవవంతుమందో లేక, పదవవంతుమందో, తిరిగి ఎన్నికలు కావలెనని కోరుచో, అప్పుడు వారు, తమ స్థానముల ఖాళీచేయవలె నని నిర్ణయించుట మేలు.

తమ శాసనసభాసభ్యులు, తాము కోరుబిల్లుల ప్రవేశపెట్టనిచో, ఆబిల్లులను ప్రజలే తయారుచేయించి, శాసనసభవారికి పంపి, రాజ్యాంగ ప్రధానాధికారిద్వారా, వాని తగురీతి పరిష్కరింపజేసి, రిఫరెండమునకు పెట్టించవచ్చును. ఆబిల్లులను ప్రజలెల్లరు మెజారిటిపై అంగీకరించుచో శాసనములుగా ప్రకటింపబడును. అటులనే, తమ ప్రతినిధుల కయిష్టమైనప్పుడుగాని, తమ ప్రతినిధుల బలపరచవలసినప్పుడుగాని, జర్మనీయందువలె, శాసనసభ వారికి, వివాదగ్రస్థమగు వ్యవహారముల విచారించుటకై, పిటీషనుల బంపుటకు ప్రజాసంఘముల కధికారముండుట శ్రేయోదాయకము.

శాసనసభాసభ్యు లెట్లు, ప్రజలయెడ, తమధర్మముల నెఱపవలెనో, అటులనే పౌరులును, తమందరియెడ తామే కొన్ని బాధ్యతల నడుపవలయును. శాసనసభాసభ్యులు, తమ సభ్యత్వముద్వారా, ఎలాంటిస్వలాభముపొంద బ్రయత్నించ