పుట:Adhunikarajyanga025633mbp.pdf/32

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మెంటు ప్రజలెల్లరవశంగతమైనది. "మైనారిటీ" పక్షీయులగు లేబరుపార్టీవారు రెండుమారులు మంత్రివర్గముల నేర్పరుప గల్గిరి. ఆస్ట్రేలియాయందు, శాసనధిక్కారమునందు నమ్మిక గల్గిన లేబరుపార్టీ వారు, శాసనబద్ధముగా నాల్గుమారులు మంత్రివర్గము నేర్పరచి రాజ్యాంగమునకు సేవచేసిరి. తన్ను తాసంస్కరించుకొన్నకొలది, తనప్రజలకు క్రమముగా హెచ్చుచున్నయధికారము, పట్టుదల తనపైకల్గించుకొన్నకొలది, ప్రజాస్వామికము బలిష్టమగుచుండును. కాని ఏకచ్ఛత్రాధిపత్యము, అల్పసంఖ్యుల రాజ్యాధికారము బలహీనమగును. ప్రజాస్వామ్యపు రాజ్యాంగమునకు ప్రజలు బంధువులు. తదితర రాజ్యాంగవిధానములకు ప్రజలజూచిన భయోత్పాతముకల్గును. ఏశక్తి (Ability to amend itself) తన్ను రక్షించుకొనుటకై, తన్ను వృద్ధిపరచుకొనుటకై యుపయోగపడగలదో అయ్యదియే ప్రజాస్వామికమునకు స్వవినాశనకరము గాగూడ పరిణమించుటయు దుస్సాధ్యముకాజాలదు. కనుకనే ప్రజాస్వామిక రాజ్యాంగముయొక్క వృద్ధినాశనములు, దానికి ప్రాణసమానమగు ప్రజల చిత్తవృత్తులపై, నీతినియమములపై సంపూర్ణముగా నాధారపడియున్నవి. ప్రజలే తమప్రజాస్వామిక రాజ్యాంగముద్వారా, అమృతపృష్టినైనబొంది సకల సౌభాగ్యములబొందనగును. వారే, అద్దానివలననె స్వవినాశనకరమగు, జీవనవిధ్వంసకమగు, అరాచక, అమానుషపాలన