పుట:Adhunikarajyanga025633mbp.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధర్మచింతనమును మాని, సర్వస్వతంత్రతకోరు సభ్యుల నెట్లు పౌరులు, ఋజుమార్గమునకు తెచ్చుట? అట్టి అసాధారణ పరిస్థితులందు పౌరులు తమ సభ్యతను, తిరిగి పొందుట యెట్లు? పౌరులు కోరదగినదెల్ల, పార్టీ కార్యప్రణాళికల తిరస్కరించిన సభ్యులను, రాజీనామా యివ్వమనియు, తిరిగి ధైర్యమున్నచో, ఎన్నికలకు నిలబడమనియు మాత్రమే! ఇంతవరకు మొత్తముమీద, తన పార్టీనిమార్చుకొనిన ప్రతిసభ్యుడును, పాశ్చాత్యదేశములందు, అందును ఇంగ్లాండులో, తిరిగి వెంటనే ఎన్నికలకు నిలబడుట ఆచారమైయున్నది. ఇందువలన వోటరులకు, తమ కట్టి సభ్యు డిష్టమో కాదో, లేక ఎదిరించబడిన పార్టీయొక్క నూతన అభ్యర్ధియే యిష్టమో తెల్పుటకు అవకాశముకల్గును. కాని, ఈ యాచారము కిందటి ఆరేడువత్సరములందు కొన్ని సమయములందు ధిక్కరింపబడుచున్నది. జర్మనీ, ఫ్రాన్సు, అమెరికాదేశములందువలె, పార్టీలకు మినహా ఎవరును సభ్యులుకాజాలరని స్థితికల్గుచున్నది గనుక, ఈయాచారము శాసనబద్ధమగుట లాభకరము. కాని, రాచకీయపార్టీని మార్చుకొన్నప్పు డెల్ల సభ్యులు తమ స్థానముల ఖాళీచేసి, తిరిగి ఎన్నికల తెచ్చిపెట్ట వలయునను నియమమేర్పరచినచో, పార్టీలకు తమ సభ్యులపైయుండు పెత్తన మిప్పటికంటె ఎన్నో రెట్లు హెచ్చిపోవును. అందువలన, పార్టీయన్న అభిమానులై యుండినను,