పుట:Adhunikarajyanga025633mbp.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నసభద్వారా తగినంత సేవ చేయవలయుననియే పౌరులు కుతూహలపడుచుండ వలయును. పార్టీలయొక్క కార్యప్రణాళికలను కాలానుగుణముగా కల్గుచుండు రాజ్యాంగావసరముల బట్టి మార్పుచేయించుచుండుటయు పౌరులవిధికృత్యము. శాసనసభలందుగాని, తదితరముగాగాని, తమసభ్యులు ఆకార్యప్రణాళికలమీదనే మొత్తముమీద దృష్టినిగుడ్చి తమకు నమ్మకముకల్గించురీతి పెత్తనముచేయవలెనని పౌరులు తమ సభ్యులకోరవలెను. అటుల తమధర్మము నెరవేర్చక పార్టీల కార్య ప్రణాళికలనే తిరస్కరించి సంపూర్ణముగా స్వతంత్రించి పార్టీలనుమార్చు సభ్యులను తమపదవులకు రాజీనామానివ్వమని కోరుటకు పౌరులకు హక్కుకలదు. ఈ హక్కు శ్రీబర్కుగారు నిర్వచించిన సభ్యుని స్వాతంత్ర్య సూత్రమునకు విరుద్ధము కానేరదు. జాతీయావసరముల విచారించి దేశమునకంతకు అనువర్తించునట్లు దేశీయుల మేలునకై రాజ్యాంగ వ్యవహారముల గురించి ప్రతిపార్టీయు తనకార్య ప్రణాళికను తయారుచేయుచుండును. దాని నంగీకరించిన వారే ఆపార్టీతరపున అభ్యర్ధులుగా నిలబెట్టబడి జయప్రదులగుదురు. అట్లు తమసభ్యత్వములకు మూలాధారమైన పార్టీ కార్యప్రణాళికనె తిరస్కరించు సభ్యులు ఏధర్మమునైతే శ్రీబర్కుగారు వారికి పరమావధియని సూచించిరో ఆధర్మమును తిరస్కరించిన వారగుదురు.