పుట:Adhunikarajyanga025633mbp.pdf/317

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పట్టనట్లుండి ఎన్నికదినమునాడెవ్వరిపై మక్కువకల్గిన వారికి తమవోటులనిచ్చుట పౌరులకు భావ్యము కాదు. ముందుగానే సమర్ధులును, యోగ్యులును, పాత్రుడునగు అభ్యర్ధులను స్థిరపరచుకొని, వారే జయమందునట్లు శక్తివంచనలేక పాటుపడుట పౌరులధర్మము. కనుక, వివిధరాచకీయ పక్షముల నేర్పరచుకొని, పౌరులు పరస్పరముగా సహాకార మొనర్చుకొనుచు తమపక్షముల తరపున తగు అభ్యర్థులనిలబెట్టి వారు జయమందుటకై కావలసినప్రచార మొనర్చుట యవసరము. తమపార్టీల యభ్యర్థులు జయప్రదులు కావలెనన్న వారెట్టి పరమార్దములకై నిలబడిన దేశమోక్షము కల్గునో, అధిక సంఖ్యాకులగు పౌరులకు వారెట్లు ఆమోదకరమగుదురో విచారించి ఆయామార్గముల నవలంబించవలయును. ఇందులకు ఇప్పటి ప్రజాస్వామిక రాజ్యాంగములందు రాచకీయపార్టీలు బలవత్తరముగా స్థాపించబడుటయు, ఆపార్టీలకు కార్యప్రణాళికలు తయారుచేయబడుటయు, ఆప్రణాళికలు ప్రజలమధ్య ప్రచారము చేయబడుటయు, వానినంగీకరించి పార్టీలకు సేవచేసి సమర్థులగువారిని అభ్యర్థులగా నియమించుటయు, చూడనగును. ఆదేశములందు పౌరులెల్లరియొక్క ధర్మము నట్టిరాచకీయ పక్షములందుజేరి తమశక్తికొలది తమతమపక్షముల జయ సంపాదనకై కృషి చేయవలెను.

ఎన్నుకొనబడిన శాసనసభాసభ్యులు తమరాచకీయ పార్టీలందు వాని కార్యప్రణాళికల ననుసరించి దేశమునకు శాస