పుట:Adhunikarajyanga025633mbp.pdf/316

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


టించుకుందురు. క్రమముగా పార్టీకూడ తనమార్గమును మార్చుకొనవచ్చును. అటులనే ఇతరపార్టీ వారి కార్యవిధాన మేవిషయమందైన సవ్యముగనుండుచో, పార్టీసభ్యులలో కొందరు ముందువ్యక్తిపూర్వకముగా, క్రమముగా, జంటలుగా, ఆపిమ్మట బృందములుగా నా సక్రమాభిప్రాయమును అంగీకరింప మొదలిడుట సహజము. ఇట్టి నెజపరిణామము తగునట్లు వృద్ధిబొంది దేశమునకు, ప్రజలకు, శాసనసభలకు శ్రేయోదాయకమగుటకై తగుస్వాతంత్ర్యమును శాసనసభాసభ్యులకు రాచకీయపార్టీ లొసంగుటలాభకరము. శాసనసభాసభ్యులు ప్రజలకేగాక, రాచకీయపార్టీలకు గూడ సంపూర్ణముగా లొంగిపోరాదు. రాచకీయపార్టీలు సంపూర్తిగా తమచే ప్రకటితమగు కార్యక్రమప్రణాళికయం దన్ని హంశములపై పట్టుపట్టి ఇతరులతో సహకార మొనర్చక రాజ్యాంగము స్తంభించునట్లు జేయరాదు.

IV

పౌరులు తమ ప్రతినిధినియెన్ను కొనునప్పుడు ఏయే రాచకీయాశయములకై ఆర్ధిక జీవితపర మార్ధమునకై సాంఘిక పరిణాములకై కృషి చేయవలెనని కోరుదురో, ముందుగా తమకుతాము తెల్సుకొని ఆపరమార్ధములకై తనశక్తియుక్తులనే యభ్యర్ధి నుపయోగించెదనని వాగ్దానమిచ్చుచో వానినే, ఎన్నుకొనుట భావ్యము. ఎన్నికల సమయములందు తమకేమి