పుట:Adhunikarajyanga025633mbp.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లేనంతవరకు వివిధరాచకీయపార్టీలు వానిసభ్యులును "తమవారకు తమలోక"మను సంకుచితాభిప్రాయములై సమరస భావమునుబొందక జాతీయాదర్శములమరచి, "ఇచ్చి పుచ్చుకొను" స్వభావమునువీడి, ప్రజాస్వామిక మందు అభిప్రాయ ముఖ్యతను భావప్రచారమును అరికట్టుట తటస్థించును.

న్యాయముగా నేరాచకీయపార్టీయును ఏవిషయము నందును సూత్రములగురించియే పట్టుదలవహించి వివరములకు సంబంధించినంతవరకు ఇతరులనుండి యుక్తమార్గము జూపెట్టబడుటకు సంసిద్ధత జెందియుండవలెను. సత్య మొక్కరి పరమే కాదనియు, ధర్మపధమొక్కరికే గోచరమగుట లేదనియు, న్యాయమార్గమెల్లరికి, కొలదిగనో, గొప్పగనో, తెలియుచుండుననియు వివిధ రాచకీయపార్టీలును గ్రహించుటొప్పు. కమ్యునిష్టులుగాని, నాజీపార్టివారుగాని, తమ కార్యప్రణాళిక యందెంతయభిమానము కల్గియున్నను, తమ ప్రత్యర్ధులుగూడ న్యాయమార్గమును వెదుకుచున్నారనియు, కొంతవరకు సత్యపధము వారును కన్గొనియుండవచ్చుననియు తలంచి వారియభిప్రాయములు అభిమానముల యెడ గౌరవము ఆదరముకల్గి యుండుట యుత్తమము.

ఒక పార్టీ వారేదైన తప్పుమార్గ మవలంబించుచో, అందలిసభ్యు లెల్లరొక్కమా రద్దాని కనిపెట్టజాలరు. సభ్యులు వ్యక్తిపూర్వకముగా ఆతప్పిదమును కన్గొని తమ యలజడిని ప్రక