పుట:Adhunikarajyanga025633mbp.pdf/314

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అటులగాక, ఇటలీయందలి ఫాసిస్టుపార్టీ జర్మనీయందలినాజీపార్టీ, పాశ్చాత్యదేశమందలి కమ్యునిస్టుపార్టీలు, ఆస్ట్రేలియాయందలి లేబరుపార్టీలు వ్యక్తులయొక్క స్వాతంత్ర్యము నరికట్టి పార్టీ కార్యక్రమమునకే ప్రాముఖ్యతనిచ్చి శాసనసభాసభ్యు లెల్లప్పుడు తమ స్వంత యభిప్రాయములగాక, పార్టీయాలోచనలనే ప్రకటించుచుండవలెనని పట్టుపట్టుచో ఆసభ్యులాలోచించుటయే మానెదరు; అభిప్రాయ ప్రకటనమే వారికి క్రొత్తదగును. అంత శాసనసభయందు స్వతంత్రమగు చర్యలు జరుగజాలవు. వివిధపక్షములు శాసనసభేతరముగనే తమతమ వైఖరిని నిర్ణయించుకొని, శాసనసభయందు నామకార్ధము కొంతవరకు చర్యలసాగించి ఒకరి వాదమువలన మరొకరు మార్పబడుటకు సంసిద్ధతకల్గియుండక ప్రజలదృష్టిని తమవైపునకు ద్రిప్పుకొనుటకుమాత్రము ఉపన్యాసములను నియమితులగు నాయకులచే చేయించుట జరుగును. ఈదినములం దనేక శాసనసభలందు ముఖ్యముగా ప్రజాప్రతినిధిసభలయందు ఇట్టి నిరుపయోగమగు చర్యలు నడుపబడుచున్నవి. శాసనసభాచర్యలవలన యేమాత్రమైన యుపయోగముండ వలయునన్న ఒక పార్టీ వారు మరొక పార్టీ వారిని ఒక సభ్యుడు మరొకరిని తమ వాదములద్వారా, ఉపన్యాసములద్వారా, తమ కార్యవిధానమునకు కొంతవరకైన సుముఖముగా నొనర్చుకొనుటకు తగు యవకాశముండవలెను. అట్టియవకాశము