పుట:Adhunikarajyanga025633mbp.pdf/313

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సభ్యుడు తన యిష్టమువచ్చినట్లు ప్రతిరాచకీయ వ్యవహారములైనను, శాసనసభయం దుపన్యసించుటకు వీలులేకున్నది. అన్ని ముఖ్యవ్యవహారము లందును పార్టీయే ముందుగా సమావేశమై సభ్యులెట్టివైఖరి జూపనగునో, ఎటుల వోటుచేయనగునో తీర్మానించుచుండును. ఒక్కొక్కప్పుడు పార్టీనాయకు లెవ్వరో, ఇద్దరో నల్గురో, పార్టీ వైఖరిని నిర్ణయించుచుందురు. ఈవిధముగా సభ్యుడు అస్వతంత్రుడగుచున్నాడు. తనపార్టీద్వారా క్రొత్తవ్యక్తిత్వమును బొందుచున్నాడు. క్రొత్తశక్తుల సంపాదించు కొనుచున్నాడు.

వివిధబృందముల తమప్రత్యేక పట్టుదలను పరస్పరముగా వీడి సహకారము ఒకరితోనొకరు చేసుకొనుట కెట్లు ప్రయత్నించ వలెనో అటులనే తమసభ్యులకును సాధ్యమైనన్ని వ్యవహారములందు, వోటింగులందు, స్వాతంత్ర్యమిచ్చుట లాభకరము. ఎల్లప్పు డన్నివిషయములందు పార్టీయభిప్రాయము ప్రకారమె వోటుచేయవలెను, ఉపన్యసించవలెనను ఆజ్ఞనే సభ్యులకిచ్చుచో వారికి నిరుత్సాహతకల్గి ఆలోచించుట కుత్సాహము లేక మందమతులగుట సిద్ధము. అటులగాక అప్పుడప్పుడు వారికి సర్వస్వాతంత్ర్యము నిచ్చుచో ఉత్సాహపరులై నిర్మాణకార్య కలాపములందు జొచ్చి స్వాతంత్ర్య సభ్యత్వపు సౌఖ్యముల ననుభవించి హెచ్చుశ్రద్ధతతో, ఇష్టముతో పార్టీవారి ఆజ్ఞలపిమ్మట శిరసా వహించును.