పుట:Adhunikarajyanga025633mbp.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వలెనో తెల్పుటకు ప్రజలకు దుస్సాధ్యముగదా! ఎన్నికలందు ఒకేపార్టీవారిచే ఆతడెన్నుకొనబడినను సభ్యుడై నపిమ్మట మాత్రము తాను ప్రజలందరి ప్రతినిధినని ప్రతిసభ్యుడు తలంచవలసియున్నది.

తన సభ్యత్వమునకు మూలాధారులైన ప్రజలకె తాను దాసుడై యుండుటకు మారు ఏజెంటుగా యుండుటకు బదులు ప్రతినిధిగాను, స్నేహితుడుగాను, నాయకుడుగాను వ్యవహరించుట సభ్యతయని శ్రీఎడ్మండు బర్కుగారు ఇప్పటి కెప్పుడో తన నియోజకవర్గమగు బ్రిష్టల్ వోటరులకు తెలియపరచెను. ప్రతి అభ్యర్ధియు తానే యేరాజ్యాంగ సంస్కరణములకు సుముఖుడో, ఏయే రాజకీయ సిద్ధాంతము ననుసరించి తనసభ్యత్వము నడుపతలంచునో ఎన్నికలందు ప్రజలకు తెలియజేయవచ్చును.

ఈదినములందు ప్రతి అభ్యర్ధియు ఏదే నొక రాచకీయ బృందమునందు కాని పార్టీయందు కాని సభ్యుడై యుండును. జర్మనీదేశమందును, ఫ్రాన్సునందును "ప్రపోర్షనల్" ప్రాతినిధ్యపద్ధతి అమలునందున్నదిగనుక ఎన్నికలందు అభ్యర్థుల కంటె పార్టీలే హెచ్చుప్రాముఖ్యత నొందుచున్నవి. ఇతర దేశములం దీపర్యవసానమే కల్గుచున్నది. కనుక శ్రీ బర్కుగారి సిద్ధాంతము ఈనాటి అభ్యర్థులకు సభ్యులకు అనువర్తించుటకు మారు హెచ్చుగా బృందములకే అనువర్తించునని చెప్పుట సబబుగానున్నది. ఒక్కమా రెన్నుకొనబడినపిమ్మట