పుట:Adhunikarajyanga025633mbp.pdf/310

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సరము కన్పడును. వెలుపలి నాయకులు లోపలినాయకులు, జర్మనీలోని కమ్యునిష్టులు నాజీలు, ఫ్రాన్సునందలి కమ్యునిష్టులు సోషలిష్టులు, ఒకేయభిప్రాయులై ఏమాత్రము తమ కార్యప్రణాళికలందు మార్పుల జేయకోరమి రాజ్యాంగక్షేమము భంగ మొందుచున్నది. కాని పార్టీపట్టుదల నిలబడి యున్నది. ఇంగ్లాండునందు వెలుపలినాయకులు లోపలినాయకులయెడ భ్రాతృభావము నెరపి అవసరమగు మార్పులను తమ కార్యప్రణాళికలందు జేయుట కొప్పుకొని రాచకార్య విజ్ఞానమును జూపెట్టుచున్నారు. ఆస్ట్రేలియాయందు లేబరుపార్టీ మంత్రివర్గముల నేర్పరచినను రాజ్యాంగావసరముల గమనింపక వెలుపలి నాయకుల యాజ్ఞల ననుసరించియే మంత్రివర్గములు నడచుటవలన లేబరుపార్టీకి అపజయము సంప్రాప్తమైనది. రాజ్యాంగారోగ్యము బాగుపడి సభ్యులు దేశసేవాపరాయణులై యుండవలెనన్న ప్రజలయందలి పార్టీనాయకులు తమపక్షములకు జెందిన శాసనసభానాయకులకు స్వతంత్రత నొసంగు టగత్యము.

III

శాసనసభాసభ్యుడు తననియోజకవర్గముయొక్క ఆజ్ఞల ననుసరించి నడచుకొనవలసియుండుట శ్రేయము కాదు. నియోజకవర్గముయొక్క సాధారణ రాచకీయాభిప్రాయముల నాతడు గమనించి సాధ్యమైనంతవరకు వానికి శాసనసభ