పుట:Adhunikarajyanga025633mbp.pdf/309

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కలసి సహకారము చేసుకొనుటకై తగ్గించుకొనుచుందురో అటులనే వివిధబృందములు తమతమ ప్రత్యేకపట్టుదలలను కొంతవరకు తగ్గించుకొని అందరికి సమ్మతమగు కార్యప్రణాళికను తాత్కాలికముగా అమలునందు పెట్టుటకు సంసిద్ధత బొందవలెను. అప్పుడే రాజ్యాంగజీవితము సాధ్యమగును. అప్పుడే శాసనసభలు తమ ధర్మనిర్వహణ మొనర్చకల్గును.

ఇట్టి యవసరముయొక్క తీక్ష్ణజ్వాలలకు గురియై వివిధబృందములు శాసనసభలందు కొంతవరకు మెత్తబడుచున్నవి. ఈ సక్రమమగు, లాభకరమగు మార్పుల జూచి వెలుపలనున్న ఈబృందముల నాయకులు, అనుచరులు ఓర్వజాలక తమయశాంతిని ప్రకటించుచుండుట అనుభవైకవేద్యము. ప్రతిదేశమందును శాసనసభయందలి బృందములన్నిటికి కార్యనిర్వాహకు లుందురు. ఆబృందముల అనుచరులు, నాయకులు శాసనసభాంగణమునకు వెలుపల కార్యనిర్వాహక సంఘముల స్థాపించుచున్నారు. తఱచుగా శాసనసభలలోని నాయకులకు వెలుపలినాయకులకు సంఘర్షణ జరుగుచుండుట సహజేమేకదా! వెలుపలివారికి వోటరుల పట్టుదలయే చూడనగును. లోపలివారికి రాజ్యాంగమును నడుపుటలోగల సాధకబాధకములు తెలియును కనుక కొంతవరకు తమతమ పట్టుదలను తగ్గించుకొనవలసిన యవ