పుట:Adhunikarajyanga025633mbp.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎట్టి కార్యప్రణాళికయుండునో, శాసనసభాసభ్యులకు గాని, ప్రజలకుగాని తెలియకుండుటయు తటస్థించుచున్నది. ఇందువలన, మంత్రివర్గములచర్యల సంతృప్తికరముగా విమర్శించుటకుగాని, ప్రజలకు రానున్న మంత్రివర్గపు కార్యప్రణాళిక యిదమిద్ధముగా యుండునని చెప్పుటకుగాని, సభ్యులకు సాధ్యపడుట లేదు. ఇట్టిపరిస్థితులందు, సభ్యులు, తగినంతసేవ చేయ లేకున్న వింతయేమి?

ఇంగ్లాండునందువలె రెండు లేక మూడు ప్రధానపక్షములైన యుండవలెను. లేదా బృందముల సమ్మేళనములు రెండో లేక మూడో యుండవలెను. ఒకమంత్రివర్గము పదభ్రష్టతబొందుటతోడనే మరొక మంత్రివర్గము ప్రత్యర్ధిబృంద సమ్మేళనములలో నొక్కదానిచేగాని, రెంటిచేకాని ఏర్పరుపబడవలెను. అటుల లేక, ఇప్పుడు ఫ్రాన్సు, జర్మనీలందున్న స్థితిగతులే తప్పనిచో, సభ్యులు వ్యక్తిగతముగను, బృందములద్వారాను, సంకుచితాభిప్రాయములు కల్గి, స్వార్ధలాభముల జూచుకొనెదరు. ప్రతిబృందమును తమ ప్రత్యేకలాభమునే కోరునంతవరకు, రాజ్యాంగశాంతి క్రమముగా క్షీణించుచుండుటయు, ప్రజాక్షేమము భంగపడుటయు బాధ్యతాయుత ప్రభుత్వవిధానము కళంకమగుటయు జరుగును. రాజ్యాంగక్షేమమునకై వ్యక్తు లెట్లు తమ ప్రత్యేకాభిప్రాయముల తీవ్రతను కొంతవరకు ఇతరులతో