పుట:Adhunikarajyanga025633mbp.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రమమును సక్రమముగా నడుపవలయునన్న, మరొకవిధమగునట్టియు, తన కార్యప్రణాళికతో సమానమగు ప్రాముఖ్యత ప్రచారితమైనట్టియు ప్రణాళికకల్గియున్న, ప్రత్యర్ధి బృందసమ్మేళనములు, అధమమొక్కటైన బలిష్టమై యుండవలయును. అప్పుడే, తాను పదభ్రష్టత బొందుచో, ప్రత్యర్ధి సమ్మేళనము పెత్తనమునకు వచ్చునేమో యనుభయము మంత్రివర్గమునకు కల్గి, తనకార్యప్రణాళికనైన సంపూర్ణముగా నమలుజరిపించ బ్రయత్నించును. అటులనే, ప్రత్యర్ధియగు సమ్మేళనమువారు కూడ, పెత్తనమందున్న మంత్రివర్గము పదభ్రష్టతబొందుచో, తాము మంత్రివర్గము నేర్పరచుచో, తా మవలంబించవలసిన కార్యక్రమ మిదియని తెలిసికొనియుండి, దానిని ప్రజల మధ్య ప్రచారముచేసి, దానినెట్లు అమలుజరుపుటో విచారించుచున్ననే, తాము పెత్తనమునకు వచ్చిన వెంటనే, గోళ్లు గిల్లుకొనుచు, కాలము వృధాపుచ్చక, ప్రజలకు, శాసనసభలకు సంతృప్తికల్గించుటకు సాధ్యమగును.

కాబట్టి, ఇప్పుడు ఫ్రాన్సు, జర్మనీయందున్న బృందముల వ్యవహారము లంతగా సంతృప్తికరము గావని చెప్పవలసి వచ్చుచున్నది.అచ్చట, ప్రత్యర్ధిబలగములకు, ఇదమిద్ధమను కార్యప్రణాళిక లేదు. పెత్తనమందున్న బృందములలో కొన్నియు, ప్రతిపక్షమందలి బృందములుకొన్ని చేరి, మరొక్కమంత్రివర్గ మేర్పడుచుండుటయు, ఏమంత్రివర్గమునకు