పుట:Adhunikarajyanga025633mbp.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చుటద్వారా కల్గించవలయును. ప్రతిడిపార్టుమెంటు వ్యవహారముల విచారించుటకు బడ్జెట్టు లెఖ్కలపరీక్షించుటకు వివిధ వాణిజ్య వ్యాపార సాంఘిక వ్యవహారములకు సంబంధించిన ప్రభుత్వకార్యముల గమనించు చుండుటకు స్థాయిసంఘముల నిర్మించి వానియందు వివిధ రాచకీయపార్టీలకు వాని బలముననుసరించి, సభ్యతకల్గించవలెను. ఈవిధముగనే ఫ్రెంచి, అమెరికా శాసనసభలయందు స్థాయిసంఘములు కలవు. కాని, మంత్రివర్గము యొక్క బాధ్యతను భంగము కలుగకుండా వారితో సహకారము చేయుటకును సహాయనిరాకరణము జేయకుండుటకును, ఈస్థాయిసంఘములు వ్యవహరించు చుండవలెను. కొన్నిసంఘములకు సభవారికి తమతీర్మానముల నివేదనజేయు యధికారమివ్వవలెను. మరికొన్నిటికి మంత్రులకు సలహాలనిచ్చు యధికారమున్న చాలును. ఈసంఘములందు పనిచేయు సభ్యుల కాయాడిపార్టుమెంటుల వ్యవహారము లెట్లు జరుగుచుండునో తెలియును. ప్రభుత్వమెట్లు జరుగుచున్నదో వానిసభ్యులు తెలుసుకొనగలరు. మంత్రులతోడను, ప్రభుత్వోద్యోగులతోడను సభ్యులకు ముఖాముఖి పరిచయముకల్గును.

II

రాచకీయ పార్టీ లుండుటవలననే, శాసనసభలు సంతృప్తికరముగా తమకున్న వ్యవధిలో తమ కార్యనిర్వహణము