పుట:Adhunikarajyanga025633mbp.pdf/300

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రతినిధులు రాచకీయపక్షములవారీగా సభ్యులుగానుందురు. బడ్జెట్టుబిల్లు నీసంఘమునకు నివేదించబడును. ఈసంఘమాబిల్లును సమగ్రముగా విమర్శించి తగు సవరణలజేసి తిరిగి సభకు నివేదించును. ఇంగ్లాండునందు వేరే యొకసంఘము స్థాపించబడుటకుమారు కామన్సుసభవారే కామన్సుసంఘముగా సమావేశమై, ఈప్రత్యేకపరీక్ష చేయుదురు. ఫ్రాన్సునందును, అమెరికాయందు నీస్థాయిసంఘములు సర్వస్వతంత్రతబొంది మంత్రివర్గమువారి నంతగాలక్ష్యపెట్టక తమకుతోచినరీతి ఆదాయపుమార్గముల ఖర్చులవిధానముల మార్చుచుందురు.

అమెరికాయందుతప్ప తదితరదేశము లన్నిటియందును ప్రజాప్రతినిధిసభ వారికే, బడ్జెట్టు తయారుచేయుటకు ప్రధానమగు హక్కుగలదు. సెనేటుసభ వారీదేశములందు బడ్జెట్టు బిల్లును నిరాకరించుటకుగాని, ప్రజాప్రతినిధిసభ వారంగీకరింపజాలని సవరణల జేయుటకుగాని వీలులేదు. బెడ్జెట్టుబిల్లును శ్రద్ధగావిర్శించి, తప్పొప్పులవివరించి, ప్రజలకు న్యాయా న్యాయముల తెల్పుటయే సెనేటుసభయొక్క ధర్మము. అమెరికాదేశములో మాత్రము ప్రజాప్రతినిధిసభతో సమానమగు హక్కు సెనేటుసభకును బడ్జెట్టును నిర్ణయించు యధికారము కలదు.

ఈవిధముగా, బాధ్యతాయుత మంత్రివర్గములున్న దేశములందు శాసనసభాసభ్యునకు, బిల్లులప్రవేశపెట్టి శాసన