పుట:Adhunikarajyanga025633mbp.pdf/299

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కొంత తగ్గించవలెనని ప్రతిపాదన (Cut) పెట్టి ఆవ్యవహారమునకై హెచ్చుఖర్చు అగత్యమనియు, ప్రభుత్వము సూచించు ఖర్చు చాలదుగనుక, వృధాయగుననియు, కనుక, తలపెట్టిన దానికంటె తక్కువే ఖర్చిడుట మంచిదని వాదించనగును. ప్రభుత్వము ఉపపాదించు శిస్తులు భారమైనవని తలంచుచో ఆశిస్తులను తగ్గించమనియు సభ్యు లాందోళన చేయనగును.

ప్రభుత్వము క్రొత్తసాంఘికావసరములపై ఖర్చిడుట మంచిదని తలంచినచో సభ్యులు ప్రత్యేకముగా నొకతీర్మానమును అంగీకరించి తన్మూలమున ప్రభుత్వమునకు బడ్జెట్టు తయారుచేయకముందే తగు సలహాల నివ్వవచ్చును. ప్రభుత్వము వృధాగాగాని, పొరపాటునగాని, ఏడిపార్టుమెంటుపైన గాని అధికముగా ఖర్చిడుచున్నచో ఆపొరపాటును విమర్శించుచు ఆ గ్రాంటును కొంతవరకు తగ్గించమని సవరణ ప్రతిపాదించనగును. బడ్జెట్టునందు జేర్చబడినగ్రాంటులు చాలక సంవత్సరాంతము కాకముందే తిరిగి "అనుబంధగ్రాంటు"లకై మంత్రివర్గము ప్రజాప్రతినిధిసభవారి శరణుజొచ్చుచో మన సభ్యులు ప్రతిగ్రాంటును జాగ్రత్తగా పరీక్షించి అవసరమగు విమర్శనలజేసి ప్రభుత్వమును సక్రమమార్గములందుంచనగును.

ఈధర్మములను శాసనసభవారు శ్రద్ధమై సంతృప్తికరముగా నిర్వర్తించుటకుగాను "ఫైనాన్సుస్థాయిసంఘ" మొకటి యేర్పరచబడుచున్నది. దానియందు ప్రజాప్రతినిధిసభయొక్క