పుట:Adhunikarajyanga025633mbp.pdf/292

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


"అడ్జరన్ మెంటు" తీర్మానమును ఏసభ్యుడైనను నియమితమందు మరికొందరు సభ్యుల సమ్మతిపై ప్రతిపాదించనగును. అధ్యక్షునికట్టి తీర్మానము సమ్మతి మగుచో, శాసనసభవారు దానిని చర్చించనగును. సుసమయములందట్టి తీర్మానములు సభవారిచే ఆమోదితమగుటయు, అంతప్రభుత్వపుకార్యవిధానము తగురీతి మార్చవలసినయగత్యత యేర్పడుటయు సాధ్యము.

ఫ్రాన్సునందిట్లు "అడ్జరన్ మెంటు" తీర్మానమును తగినంతవ్యవధిగా ప్రతిపాదించుటయేకాక, ప్రశ్నల కొసంగబడిన సమాధానము అసంతృప్తికరముగా నున్నయెడల, వెనువెంటనే "ఇంటరుపెల్లేషను" అను తీర్మానముద్వారా, ప్రభుత్వమునకు తగుసమాధానము సంపాదించుకొను వ్యవధి కల్గించకయే, ప్రభుత్వచర్యల ప్రజాప్రతినిధిసభయందు చర్చించి, అయ్యది సభవారిచే నంగీకృతమగుచో, మంత్రివర్గముల పతనమును దెచ్చిపెట్టుట అనుభవసిద్ధము. ఈపద్ధతి తదితర రాజ్యాంగములం దనుకరింపబడుట లేదు. ఇయ్యది మంత్రాంగవర్గముల సుస్థిరతకు చాలా భంగకరము గనుక కోరదగినది కాదు.

పెత్తనమందున్న మంత్రివర్గముయొక్క పతన మభిలషించకయే, శాసనసభయొక్క యభిప్రాయ ప్రకటనమును ఏ సంస్కరణను గురించిగాని సభ్యులు కోరుచో, ఆసంస్క్రణ