పుట:Adhunikarajyanga025633mbp.pdf/291

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దుటకూడ తటస్థించును. కనుక సర్వసాధరణముగా సభ్యుల ప్రశ్నలకు తగుసమాధానముల నొసంగుటయే ప్రభుత్వమునకు క్షేమకరము.

సాధారణముగా నిట్టిపశ్నలను, సభాసమావేశమునకు పూర్వము, కొన్ని దినములకు ముందుగా (15 దినములు) సభాధ్యక్షునికి పంపుట ఆచారమై యున్నది. అధ్యక్షులు ఆప్రశ్నలను మంత్రాంగనసభవారికి పంపి, తగుసమాధానములను కోరును. సభసమావేశమైన పిమ్మటకూడను అత్యవసరమగు విషయములహురించి కొన్నిప్రశ్నల పంపనగును. వీలున్నచో, ప్రభుత్వము తగుసమాధానముల తయారుచేయవచ్చును. సభ సమావేశమైయుండ, ప్రశ్నలకు మంత్రులు సమాధాన మిచ్చుచుండ, ఇవ్వబడిన సమాధానమునకు సంబంధించిన, "అనుబంధప్రశ్నలను" సభ్యులు పెట్టవచ్చును. సాధ్యమగుచో అప్పటి కప్పుడే ఆయామంత్రులు సమాధాన మివ్వవచ్చును. కానిచో వ్యవధి కోరనగును. చురుకుతనము కల్గి సమయస్ఫూర్తి జ్ఞానముకల్గిన సభ్యులీ "అనుబంధప్రశ్నల" తగురీతి లేపుటద్వారాయే మంత్రివర్గమునుండి తెల్వి తేటలతో ప్రజలకు సుముఖమగు సమాధానముల బొందుటయు, తమ స్వపక్షములవాదమునకు బలముకల్గించుటయు సాధ్యము. ఇట్లు ప్రభుత్వ మొసంగు సమాధానములవలన బయల్వడిన అసంతృప్తికరమగు ప్రభుత్వచర్యల విమర్శించుటకై