పుట:Adhunikarajyanga025633mbp.pdf/290

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తెలియవలెనన్న, సభయొక్క వృత్తాంతముల సర్వస్వతంత్రముగా పత్రికలు వగైరాలద్వారా ప్రకటితమగు టగత్యము. ఈహక్కును బొందుటకై ఇంగ్లాండునందు 1760 ప్రాంతమున గొప్ప యలజడి జరుగవలసివచ్చెను. ఈహక్కు నుపయోగించుకొని, ప్రతిసభ్యుడును తాను సభయందొసంగు ఉపన్యాసముల తనవోటరులకు ఎరుకపరచుకొననగును. ప్రభుత్వపు శుభాశుభకార్యముల ప్రజలకు తెల్పి, ప్రజాభిప్రాయమును తగురీతి సృష్టించవచ్చును.

ప్రభుత్వము ఏ యే సమయములం దే యే శాఖలలో ఎట్లెట్లు పెత్తనము జేయుచుం ద్రో అవసరము కల్గినప్పుడెల్ల కన్గొనుటకు ప్రతిశాసన సభ్యునకు తగుయవకాశములు అవసరము. శాసనసభయందు తగుప్రశ్నలువేసి, సంతృప్తికరమగు సమాధానముల ప్రభుత్వమునుండి పొందు యధికారము, ఆయనకుండవలయును. ప్రభుత్వము సంతృప్తికరమగు సమాధాన మివ్వకుండినచో, ఆవిషయము ముఖ్యమైనదై అధిక సంఖ్యాకులగు సభ్యుల కట్టి సమాధాన నిరాకరణమువలన, ప్రభుత్వముపై అసూయకల్గు నెడల వెన్వెంటనే, "అడ్జరన్ మెంటు" తీర్మానమును ప్రతిపాదించుట కాసభ్యునకుగాని, మరియే యితరసభ్యునకుగాని హక్కుకలదు. అధిక సంఖ్యాకులచే నాతీర్మానము సకాలమున ఆమోదింపబడుచో, ప్రభుత్వమునందున్న మంత్రివర్గము పదభ్రష్టత నొం