పుట:Adhunikarajyanga025633mbp.pdf/29

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


లననుసరించి, నిరంకుశపుపెత్తన మగత్యమగుచో, నద్దానిని ప్రజలకు బాధ్యతబొందురీతిగనే స్థాపించుటకు సాధ్యముకాగలదు. "శ్రీముస్సోలినీగారిపిమ్మట, ఎవ్వరు?" అను ప్రశ్నకు ఇటలీదేశస్థులు సమాధానమీయజాలకున్నారు. కాని ఇంగ్లీషువారికి, శ్రీరామ్సేమాక్డనాల్డుగారి పిమ్మట, ఎవ్వరు?" అనుప్రశ్నకు సమాధానము కడుసులభముగా దొరకును. ప్రతియింగ్లీషు పౌరుడును "తిరిగి పార్టీ ప్రభుత్వము నేర్పరతు" మని చెప్పగలడు.

ప్రజాస్వామిక మపజయమందిన దృష్టాంతముల విమర్శించుచో, ఆయాదేశములందలి ప్రజలు తమమధ్య ఏక చ్ఛత్రాధిపత్యముకాని, అల్పసంఖ్యాకుల వశంగతమగు పెత్తనముగాని, అసహనపరులగు యేయొక్కమతస్థులో, లేక సంఘీయులో ప్రభుత్వాధి కారమును వశపరచుకొనుటగాని కారణములని తేలుచున్నది. ఇటలీయందు భూస్వాములు, ధనాధికులు ఫాసిస్టుపార్టీని బలపరచి, శ్రీ ముస్సోలినీగారి పెత్తనము దెచ్చి పెట్టుచుండ, ప్రజలు చేతులు మోడ్చు కొని యూరకుండిరి. ఇప్పుడు జర్మనీయం దీవిధముగనే "నాజీ" పార్టీ వారు ప్రజాస్వామికమును వినాశన మొనర్పబ్రయత్నించు చుండ, ప్రజ లుదాసీనులైయున్నారు. దక్షిణమెరికాఖండ మందలి రిపబ్లికులందు, తమప్రజాస్వామిక సంస్థల నిరాకరించి, ప్రజానాయకులు నిరంకుశులగుచుండ ప్రజలు ముగ్ధులైయుం