పుట:Adhunikarajyanga025633mbp.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిర్బంధితులజేసి శాసనసభను పూర్తిగా లొంగదీసుకొన బ్రయత్నించును. మరియు, శాసనసభయందుండగా, ఏసభ్యునిగాని నిర్బంధితునిచేయుట ధర్మవిరుద్ధము. శాసనసభయొక్క ఆవరణయందు సభవారికే సంపూర్ణాధికారము చెందవలయును. పైన వివరింపబడిన ఘోరకృత్యాపరాధములకై ఏసభ్యుడైనను తనకు కావలయుచో, ప్రభుత్వము శాసనసభాధ్యక్షునికి తగు విన్నపము పంపుకొనవలయును. ఆవిన్నపమాలించి, తమసభ్యుని ప్రభుత్వమునకు వదిలివేయుటకు శాసనసభ వారంగీకరించిననే ఆసభ్యుని నిర్బంధించుటకు ప్రభుత్వమునకు హక్కు కలుగగలదు. ఈహక్కులను అప్పుడప్పుడు ఫ్రెంచిప్రభుత్వము గౌరవింపక, కమ్యునిష్టు, డెప్యూటీల నిర్బంధించుచుండుట విచారకరము. మనదేశమందును, బెంగాలు ప్రభుత్వము, శాసనసభాసభ్యులను విచారణ లేకయే నిర్బంధితుల జేయుచుండుటయు, పౌరసత్వపుహక్కులకు విరుద్ధము. శాసనసభాసభ్యుల హక్కులకు భంగకరము.

శాసనసభయందు చేయబడు యుపన్యాసముల కేరును శిక్షాపాత్రులు కాగూడదు. ఆయుపన్యాసములను వార్తాపత్రికలద్వారా కరపత్రములద్వారా ప్రకటించుటకు సర్వస్వాతంత్ర్య మగత్యము. సాధారణముగా శాసనసభయొక్క సమా వేశములకు కొలదిమందియే ప్రేక్షకులు వచ్చెదరు. దేశీయు లెల్లరకు సభవారి కార్యక్రమముగురించి వివరములు