పుట:Adhunikarajyanga025633mbp.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శిక్షాపాత్రులగుచో, అతడు మూగవాడగును. కాన శాసనసభలం దొసంగబడిన యుపన్యాసములందు వెలిపుచ్చబడిన విషయములం దెద్దానికైనను, ఏ సభ్యుడును శిక్షాపాత్రుడు కాగూడదు.

ప్రభుత్వ వ్యవహారముల నిర్వహించు నుద్యోగులలో నెవ్వరివలన నైనగాని, శాసనసభాసభ్యుడు ప్రభుత్వపు అపకార్యముల గురించి తగుసమాచారము తెలుసుకొని అతడా తప్పిదముల శాసనసభయందు ప్రకటించి, ప్రభుత్వమును నిరసించుటకు హక్కుకల్గియుండవలెను. తన కాభోగట్టా యిచ్చినవారెవ్వరో చెప్పవలసిన యావశ్యకత ఆయనకు ప్రభుత్వ మెప్పుడుకాని కల్గింపరాదు. కోర్టులందు ఆయనను తనభోగట్టాకు మూలపురుషుడగువానిపేరు తెలుపమని, సభ్యుని నిర్బంధింపరాదు. అట్లుకానిచో ఎప్పటికిని శాసన సభాసభ్యులకు, ప్రభుత్వోద్యోగులద్వారా ఏవిధమగు మంచిచెడ్డలు తెలియరావు.

శాసనసభలు సమావేశమై యుండునంతకాలము, ఏ శాసనసభాసభ్యుడును, అప్పటికప్పుడొనర్చిన హత్యానేరము రాజవిద్రోహకార్యము, మరియే యితర ఘోరకృత్యమునకు గాక, అదివర కెప్పుడో యొనర్చిన తప్పిదమునకై నిర్బంధింపబడరాదు. ఇట్టి స్వాతంత్ర్యము సభ్యునకు లేనిచో, తన కయిష్టులగు, తనతప్పిదముల బయల్వెట్టువారిని, ప్రభుత్వము