పుట:Adhunikarajyanga025633mbp.pdf/286

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వచ్చుచున్నది. ఇంగ్లాండునందు రెండుమూడు వత్సరములు, ఐర్లండునందు తొమ్మిది మాసముల కాలము చట్టనిర్మాణ మాగవలసియున్నది. ఈవిధముగ సెనెటుసభ యుండుటవలన శాసననిర్మాణము మందగతి బొందుచున్నది. సంస్కరణములు శాసన రూపము దాల్చుట దుర్ఘటమగుచున్నది. ఎన్నటికో శాసననిర్మాణావశ్యకత తెలుసుకొని ఈ రాజ్యములు ఏకసభాస్థాపన మొనర్చునది! అదృష్టవశాత్తు మనరాష్ట్రములందైన ఏకసభాస్థాపనము జరుగవచ్చునని తోచుచున్నది.
_________________