పుట:Adhunikarajyanga025633mbp.pdf/285

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఈ దినములందుమాత్ర మాసభ నిరుపయోగమై యున్నదన్న సత్యదూరము కాదు. ఫ్రాన్సునందలి సెనెటుసభ యందనుభవజ్ఞులు, వయోవృద్ధులు, సుప్రసిద్ధు లనేకులుండుటచేతను, కమిటీలద్వారా వారు ప్రభుత్వచర్యల పరీక్షించగల్గుశక్తి యుండుటవలనను అ సెనెటు చాలాప్రాముఖ్యత వహించుచున్నది. అమెరికాసభ అన్నిటికంటెను బలిష్టమైయున్నది.కెనడాసభయు దక్షిణాఫ్రికాసభయు అంత ప్రాముఖ్యత బొందకున్నను స్థాయిసంఘములవలన కల్గు ప్రయోజనముల కల్గించుచున్నది. జర్మను సెనెటునందు రాష్ట్రీయప్రభుత్వముల ప్రతినిధులుండుటచే వివిధరాష్ట్రీయుల కెట్లెట్టి శాసనము లగత్యమో తెల్పుటకుమాత్ర ముపయోగ పడుచున్నది. ఐర్లండు సెనెటుసభయు నార్వేసభయు ప్రజాప్రతినిధిసభపై ఆధారపడియుండి స్థాయిసంఘపు ప్రయోజనముల కల్గించుచు, ప్రజలకు వలయు శాసననిర్మాణకార్యము సాగునట్లు తోడ్పడుచున్నవి. ఆస్ట్రేలియాయందలి సభమాత్రము ప్రజాప్రతినిధి సభ కెదురై ప్రతిష్టంభనమును సాగింపకల్గియున్నది.

ఇటుల రెండు శాసనసభలున్నను మరియేయితర సహాయము లేకనే శాసననిర్మాణము సుగమముగా జరుగుట సాధ్యము కాకున్నది. ఆస్ట్రేలియాయందు ఈ రెండు సభల మధ్య భేదభావము కల్గిన జనరలుఎన్నికలు రెండుసభల కగత్యమగు చున్నవి. జర్మనీయందు "రిఫారెండము" కావలసి