పుట:Adhunikarajyanga025633mbp.pdf/284

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సమాధాన మివ్వ బ్రయత్నించితిమి. ఏక శాసనసభయే యంగీకరింపబడుచో ఏయే విధముల ఇప్పటికంటె హెచ్చు జాగ్రత్తగా సమర్థతతో శాసననిర్మాణము జేయవీలగునో జూచితిమి. రెండుశాసనసభలనే కల్గియున్న దేశములందు సెనెటుసభ యెట్లు నిర్మింపబడుచున్నదో దానికి శాసననిర్మాణమం దేయే యధికారములు కలవో రెండు శాసనసభల మధ్య శాసననిర్మాణమందు సంఘర్షణ కల్గుచో ఎటుల శాసననిర్మాణకార్యము జరుగుచున్నదో విచారించితిమి. బడ్జెట్టు విషయమం దెట్లు సెనెటుసభకు జోక్యము తగ్గింపబడినదో ప్రభుత్వ వ్యవహారముల విమర్శించుటయందు ప్రజలకు ప్రభుత్వచర్యలగురించి భద్రత కొల్పుటయం దెట్లు సెనెటుసభ వారు ప్రజాప్రతినిధి సభవారికి సహకార మొనర్పవలెనో సూచించితిమి. ఈవిధముగ రెండవ శాసనసభ తప్పనిసరియగుచో వస్తునిర్మాతల సభనే యేర్పరచుట మంచిది.

ఇంగ్లాండునందలి రాజకీయజ్ఞులు ప్రభువుల సభను సంస్కరించవలెనని చాలా కాలమునుండి ప్రయత్నముల జేయుచు ఆశాభంగులగుచున్నారు. ఇప్పటికున్న ప్రభువులందరికి కొందరు సభ్యుల నెన్నుకొను హక్కు నొసంగి జీవితాంతము వరకు సభ్యులుగా నుండుటకై రాచకీయజ్ఞు లాదిగాగలవారిని కొందరి నిరూపించి ఆసభ యిప్పటికంటె హెచ్చు యుపయోగ కారిగా నుండునట్లు చేయ కొందరు తలపెట్టుచున్నారు.