పుట:Adhunikarajyanga025633mbp.pdf/283

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దింకనువాడుకలోనే యున్నది. మొత్తముమీద యీహక్కు సెనెటుసభవారినుండి తగ్గించుటయే ఆచారమగుచున్నది.

ఫ్రాన్సునందు ప్రజాప్రతినిధిసభ నంత మొందించుటకు రిపబ్లికు ప్రెసిడెంటుగారు సెనెటుసభవారి యనుమతిబొందవలెను. కాని చాలకాలమునుండి ప్రెసిడెంటుగారు తన యీయధికారము నుపయోగించుట లేదుగాన సెనెటువారికి ప్రజాప్రతినిధిసభ వారిపైగల యధికార మదృశ్యమగుచున్నది. అమెరికాయం దింకను సెనెటుసభ కార్యనిర్వహణమందే ప్రెసిడెంటుగారితో కలసి కొన్ని యధికారముల నడుపకల్గుచున్నది. సుప్రీముకోర్టు జడ్జీలు తన మంత్రులు ఫెడరలు రిజర్వుబోర్డు వ్యవ ----- బోర్డుల సభ్యులు ఆదిగాగల ప్రధానప్రభుత్వోద్యోగుల నియమించుటలో ప్రెసిడెంటీ సభవారి సహకారము పొందవలసి యున్నది. ఇందువలన ప్రతిరాష్ట్రపు ప్రధాన సెనెటరునకు చాల పెత్తనము ప్రాముఖ్యత సంపాదితమగుచున్నది. ఇతరదేశములపై యుద్ధము ప్రకటించుటకు గాని, యుద్ధమాపి సంధి చేసుకొనుటకు గాని, ప్రెసిడెంటుగారితో సెనెటుసభవా రంగీకరింపవలెను. శిస్తులవేసి ప్రభుత్వధనము ఖర్చిడుటలోకూడ సెనెటుసభవారికి ప్రజాప్రతినిధిసభ వారితోబాటు సమానమగు హక్కుకలదు.

ఈ ప్రకరణమందు ప్రజాస్వామిక మగు రాజ్యాంగములందు రెండు శాసనసభ లగత్యమా యను ప్రశ్నకు