పుట:Adhunikarajyanga025633mbp.pdf/280

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రభుత్వపు అ కార్యముల పరీక్షించి తప్పొనర్చినవారి కన్గొని తప్పుల నిరాకరించు మార్గముల సూచించుటకు విచారణ సంఘముల నిర్మించుటకు రెండుసభలవారికి సమానాధికారము కల్గుట శ్రేయము. మరియు ప్రజాప్రతినిధిసభ వారికంటె ఇట్టి విచారణలను సెనెటుసభవారే హెచ్చుశ్రద్ధతో సమర్ధతతో చేయగలరు.

ప్రజలకు రాచకీయ విజ్ఞానమును కల్గించుటలోను, మంత్రివర్గపుచర్యల ప్రకటించుటలోను ప్రజాభిప్రాయము స్థిరపడుటకై తగు సహాయము చేయుటలోను వివిధరాజ్యాంగ సాంఘికేతర సంస్కరణలు ప్రజలయందు ప్రచారితమగుటలోను ప్రజాప్రతినిధి సభవారితోబాటు సెనెటుసభ వారును ప్రజాసేవ చేయనగును. మరియు ప్రజలకు రాచకీయనాయకు లెవ్వరెవ్వ రెట్టెట్టివారో తెలియజేయుటకు ప్రజాప్రతినిధులు ప్రజాసేవ చేయుటయందు ప్రజాభీష్టముల తెల్పుటయందు ప్రజలకు ముందు దారిజూపెట్టుటందు నాయకత్వము తమయందు పెంపొందింపజేయుటకు ఈ రెండుసభలును తగు యవకాశము కల్గించుట కుపయోగపడుట శ్రేయము. కనుకనే అమెరికాయందు తప్ప తదితర ప్రజాస్వామికదేశములందు మంత్రులతో కొందరు సెనెటుసభయందుకూడ సభ్యులైయుండనగును. స్విట్జర్లండు, జర్మనీ, నార్వేదేశములందు ప్రతిమంత్రియు అవసరమగు నప్పుడెల్ల సెనెటుసభయొక్క