పుట:Adhunikarajyanga025633mbp.pdf/28

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కార్యక్రమమును సమగ్రముగా విచారించుచుయున్న యెడల సకాలమున ప్రభుత్వకార్యక్రమమును అమలునందు బెట్టుట దుస్తరమని వివిధరాచకీయకక్షల సమ్మేళనము నేర్పరచి (Coalition Government) దానితరపున, మంత్రాంగవర్గమును, పార్లమెంటునాయకులు సాగించి, దేశసేవ చేసిరి. దాదాపు ఆరువత్సరములకాలము శ్రీలాయడుజార్జిగారు, నిరంకుశుడై, పాలనమొనర్చెను. కాని, జర్మనుచక్రవర్తియు, శ్రీముస్సోలినీగారును ప్రజలకు బాధ్యులుకారు గాని, శ్రీలాయడుజార్జిగారు పార్లమెంటునకు, ఆపార్లమెంటు ప్రజలకు బాధ్యులై యుండకతప్పినదికాదు. అటులనే, ఆర్థికసంక్షోభము కలుగనున్నదను భయోత్పాతము 1931 వ సంవత్సరమున కలుగగా, శ్రీరామ్సేమాక్డనాల్డుగారి నాయకత్వముక్రింద, వివిధరాజకీయ పక్షములనాయకులు, "జాతీయప్రభుత్వము" నేర్పరచిరి. ఈజాతీయప్రభుత్వమునే ప్రజలు, క్రొత్తయెన్నికలయందు బలపరచిరి. ఇప్పటిపార్లమెంటు జరుగునంతకాలము (5 వత్సరములు) జాతీయప్రభుత్వము వారు తమకుదేశోపకారముగా దోచిన పద్ధతిని, రాజ్యముచేయుట కర్హులై యున్నారు. ఈవిధముగనే ఆర్థికమోక్షము కల్గించుటకై, ఫ్రాన్సుదేశమందు శ్రీపాయింకేరేగారు "జాతీయప్రభుత్వమును" 1922 లో మూడువత్సరముల పర్యంతమునడపిరి. కాన ప్రజాస్వామిక రాజ్యాంగములందును, తాత్కాలికావసరము