పుట:Adhunikarajyanga025633mbp.pdf/279

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తప్పొప్పుల గమనించి ప్రజలకు ప్రభుత్వపు మంచి చెడ్డల ప్రకటించుటకు సెనెటుసభ వారెల్లెడ నుపయోగపడుచున్నారు. ఈ విషయమునందు ప్రజాప్రతినిధిసభ వారికివలెనే ఈసభకు సంపూర్ణమగు సమానాధికార మొసంగుట లాభకరము. వ్యవధి అంతగాలేని ప్రజాప్రతినిధిసభ వారికి ఈసభవా రీవ్యవహారమందు చేయూతగా నుండవచ్చును. ఎప్పటికప్పుడు ప్రతి ప్రభుత్వపు శాఖయందు ఎల్లెడల యెట్లెట్లు రాజ్యాగ వ్యవహారములు నడుపబడుచున్నవో ప్రజలకు తెల్పుట చాలయగత్యము. ప్రభుత్వమందున్న మంత్రివర్గమునకు తన సకార్యముల ప్రకటించుకొనుటకు ప్రతికక్షులకు ప్రభుత్వపు అ కార్యముల వెల్లడించుటకు ప్రజాప్రతినిధిసభవారితో బా టీసభవారును సహాయపడవచ్చును. ప్రభుత్వపు చర్యల ననుదినము పరీక్షించుటయు మంత్రివర్గమువారికి ప్రజాక్షేమకరములగు మార్గముల సూచించుటయు, ప్రభుత్వముయొక్క తప్పొప్పుల సూదిగ్రుచ్చినట్లు లెక్కించుటయు ప్రజోపయోగకరము. కనుక ఈ ధర్మమును రెండుసభలును నిర్వర్తించవలయును. ఇందులకై ప్రతిసభయు ప్రశ్నల వేయవచ్చును. తీర్మానముల ప్రతిపాదించవచ్చును. ప్రభుత్వముయొక్క ప్రకటనల కోరవచ్చును.

ప్రశ్నలద్వారా కన్గొనబడిన తప్పుల జాగ్రత్తగా విచారించుటకు గాని, ప్రభుత్వ ప్రకటనలవలన బయల్పడిన