పుట:Adhunikarajyanga025633mbp.pdf/271

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ను. ఆ సభయందలి సభ్యులలో మెజారిటీవా రేయేభాగముల నంగీకరింతురో, వానినన్నిటి జేర్చినచో యేర్పడుబిల్లును, మెజారిటీవా రంగీకరించినచో, అప్పుడు బిల్లు శాసనముగా పరిగణింపబడును. ఆస్ట్రేలియాయందు, ప్రజాప్రతినిధిసభలో కార్మికులకును, సెనెటునందు ధనికులకును, భూస్వాములకును హెచ్చుప్రాముఖ్యత చేకూరుచుండును. రెండుసభలును, ఒకేవోటరుబృందములచే యెన్నుకొనబడుచున్నను, సెనెటుసభకు అభ్యర్థులుగా నిలబడువారు ధనికులైయుండనిచో, ఎన్నికల ఖర్చుల భరింపజాలరుగదా! అప్పటికి లేబరుపక్షముకూడను, తదితరదేశముల సెనెటుసభలందుకంటె, ఆస్ట్రేలియా సెనెటుసభయందెక్కువ సభ్యతబొందకల్గుచున్నది. సహజముగనే, ఈ రెండుసభలమధ్య అనేకమారులు సంఘర్షణకల్గుచుండును. కొలదికాలమే పెత్తనమందుండు మంత్రివర్గమువారు తలపెట్టిన శాసననిర్మాణమును వ్యతిరేకపక్షము సెనెటుయందు ప్రాముఖ్యత బొందియుండుచో, సులభముగా నరికట్టుట సాధ్యము. కనుక శాసననిర్మాణము, ఆదేశమం దత్యంతకష్టసాధ్యమగుచున్నది. రెండుసభలును, ఒకేవోటరు సముదాయమునకు బాధ్యతవహించు చుండుటయు, అందును, ప్రజాప్రతినిధిసభాసభ్యులు చిన్న చిన్న నియోజకవర్గముల తరపునను సెనెటరులు రాష్త్రములతరపున యెన్నుకొనబడుచుండుటచే, సెనెటరులు ప్రజాప్రతినిధిసభవారి నెదిరించుట