పుట:Adhunikarajyanga025633mbp.pdf/266

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లేదా, జయప్రదముగా ప్రతిష్టంభనముచేయకల్గును. అనుభవమందును, రాచకీయ పరిజ్ఞానమందును, సెనెటుసభ వారు ప్రజాప్రతినిధిసభవారికంటె ఆధిక్యత కల్గియున్నను, ప్రజాభిప్రాయము ననుసరించి శాసననిర్మాణము చేయవలసిన బాధ్యతను, ప్రజాప్రతినిధిసభవారు నెరవేర్పకల్గినట్లు సెనెటుసభవారు నిర్వహింపజాలరు గనుక, ఇంతబలవంతమైన సెనెటుసభను నిర్మించుట ప్రజాభ్యుదయ కారకముగా లేదు. స్త్రీలకు వోటుహక్కు ప్రసాదించుటకు, ఫ్రెంచిప్రజలెల్లరు సుముఖులైయున్నను సెనెటుసభవారు కాలడ్డముబెట్టి, అవసరమగు శాసననిర్మాణమును నిరోధించుచున్నారు.

ఐర్లాండునందలి, ఐరిషు ఫ్రీస్టేటువారి సెనెటుసభ అత్యున్నతమగు పద్ధతులననుసరించి నిర్మింపబడుచున్నది. ఈసభ యందు (సెనెడు ఐరీషు) అరువదిమంది సభ్యులు కలరు. ఈసభ్యులు, ముప్పది ఐదు వత్సరముల వయస్సుబొంది

ఐర్లాండు.

యుండవలెను. వారు పన్నెండువత్సరములవరకు సభ్యులై యుందురు. వారిలో నాల్గవవంతుమంది, మూడు వత్సరముల కొకమారు తమస్థానముల ఖాళీచేయవలెను. ఆస్థానములకు తగుసభ్యులను, అభ్యర్థులజాబితా యందుదహరింపబడిన వారినుండి, ప్రజలెన్నుకొనవలెను. ఈజాబితాయందు, మూడువత్సరములకొక మారు ఎన్నుకొనబడదగుసభ్యులకు మూడువంతులమంది అభ్యర్ధులను, ప్రజాప్రతినిధిసభ