పుట:Adhunikarajyanga025633mbp.pdf/256

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సభవారు ఆయాబిల్లుల పునర్నిర్మాణమొనర్చుట కవకాశ, ముకలదు.

ప్రజలయందే ఆసభయందుజర్చింపబడబోవు, చర్చింపబడుచున్న బిల్లులను ప్రచారమొనర్చుటకుగా రాచకీయపక్షములు ప్రతిపట్టణమందును స్థాపించదగు 'రాచకీయగోష్టు' లందు ప్రజానాయకులచేతను వక్తలచేతను చర్చింపజేయనగును. వార్తాపత్రికలందును ఆయాబిల్లులగుణాపగుణముల విచారింపనగును. వివిధప్రాంతములందు, ప్రజాభిప్రాయము కన్గొనుటకై వివిధరాచకీయపక్షములు తగుప్రచారమొనర్చిన పిమ్మట, సూక్ష్మముగా 'రిఫరెండము' నెత్తవచ్చును. ఈవిధముగా ప్రతిబిల్లును సలక్షణముగా నుండునట్లు జేయుటకు, సెనెటుసభయొక్క సహాయము లేకనే స్థాయిసంఘములద్వారా, గోష్టులసహాయముతో రాచకీయపార్టీల ఆందోళనవలన స్థానిక 'రిఫరెండము'ల ద్వారా, ప్రజానాయకులు తగు ప్రయత్నములు చేయనగును. అత్యవసరమైనప్పుడు 'రిఫరెండమ'ను అంకుశము నుపయోగించి అనవసరమగు బిల్లుల నురు మాడుట కవకాశముకలదు.

ప్రజల కగత్యమగు బిల్లులను, ప్రజాప్రతినిధిసభవారు తమ పై నున్న కార్యభారమును భరింపజాలక ప్రవేశపెట్టుట లేదు గనుక వానిని "సెనెటుసభ" వారు బయలుదేరదీయుదురని కొందరందురు కాని, కదాచితుగాతప్ప ప్రభుత్వమే తన