పుట:Adhunikarajyanga025633mbp.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముగా సంతృప్తికరముగా నుండునట్లు నిర్మించుటకుగాను, తగు సావకాశము కల్గియుండుటలేదు గనుక, సెనెటుసభ వారగత్యముకాదా? అట్టిపరిస్థితులందు సెనెటుసభవారు పార్టీ పద్ధతులనవలంబించక బిల్లులందంతర్గర్భితమగు సూత్రములభంగపరుపక బిల్లుల అంగుఆకారముల సక్రమముగా దిద్దుటకు పూనుకొనుచో, ఉపయోగపడగలదు. కాని, అట్టిసభ "శాసననిర్మాణస్థాయిసంఘము"లయొక్క ధర్మములనే నిర్వర్తించవలయును. కనుక ప్రత్యేకముగా నవసరమేయుండదు. మరియు 'శాసననిర్మాణస్థాయిసంఘ' మందు ప్రజాప్రతినిధిసభయందలి వివిధపార్టీలప్రతినిధులు వారివారిబలగముల ననుసరించి ప్రాతినిధ్యతబొందియుండ సెనెటుసభయందు కన్సర్వేటివుపక్షీకులే అధికసంఖ్యాకులై యుందురు కాన స్థాయిసంఘమే హెచ్చు సంతృప్తికరమైనది.

ఇట్టి స్థాయిసంఘమువారు, తమకునివేదించబడిన బిల్లులను సమగ్రముగా విచారించి అవసరమగుమార్పుల సూచించుచు, తిరిగి ప్రజాప్రతినిధిసభకు పంపుచుందురు. తమచే నిర్మితమగు తమపెద్దలచేకూడిన స్థాయిసంఘమువారే సూచించిన సూచనలు ప్రజాప్రతినిధిసభవారికి రుచ్యములగును, కాని ఆసూచనలనె, సెనెటుసభవారుచేయుచో, ప్రజాప్రతినిధిసభవారు వానియందు సుముఖులైయుండుట దుస్తరము. స్థాయిసంఘముల సూచనల పునర్విమర్శనజేసి ప్రజాప్రతినిధి