పుట:Adhunikarajyanga025633mbp.pdf/254

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


స్లావాకియా దేశమందు రెండుసభలచే నంగీకరింపబడిన బిల్లుపై 'రిఫరెండము' కావలెనని మంత్రివర్గమువారు కోరుచో "రిఫరెండము" నకట్టిబిల్లు తేబడవలెను. వోటింగునకు వచ్చిన వారిలో మెజారిటీవారు, అటో యిటో తీర్మానించగలరు. "రైష్" శాసనసభలవారిచే అంగీకరింపబడినబిల్లును, శాసనముగా ప్రకటింపరాదని, ప్రజాప్రతినిధిసభ వారిలో మూడవ వంతుమంది వారుకోరుచో, రెండుమాసములవరకు, ఆబిల్లును ఆపుదలచేయవలెను. అంత, వోటరులలో ఇరువదవవంతు మంది "రిఫరెండము" కోరుచో, ఆబిల్లు "రిఫరెండము" నకు తేబడును. ఆరెండుమాసముల వ్యవధియందే, రెండుశాసనసభలును ఆబిల్లు అత్యంతావసరమని తీర్మానించినచో, వెంటనే, శాసనముగా ప్రకటింపబడును. ఇందువలన చీటికి మాటికి ప్రతిబిల్లును "రిఫరెండము"నకు దెచ్చుటకు వీలులేకున్నది. కాని, మైనారిటీయందున్న పార్టీ, "రిఫరెండమున" కేబిల్లునైనను తెప్పించుటకు శక్తికల్గియున్నది. ఒకవేళ "రిఫరెండము"లో వివాదగ్రస్తమగు బిల్లు అంగీకరింపబడుచో, "రిఫరెండము"ను కోరినపక్షము అప్రతిష్టపాలగును గనుక, మైనారిటీపక్షముకూడ మాటిమాటికి "రిఫరెండము" కావలెనని ఆందోళనజేయుటకు బూనుకొనదు.

ప్రజలకగత్యమగు, ప్రజలచే వాంఛితమగు బిల్లులనే, ప్రజాప్రతినిధిసభవారు నిర్మించినను వారట్టిబిల్లును సక్రమ