పుట:Adhunikarajyanga025633mbp.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రముల నిరూపించుటకు తదితరవిషయముల గూర్చి తయారు కాబడుబిల్లుల విచారించుశక్తిలేకున్నది. కనుక, వాదప్రతివాదములకు తీవ్రముగా తావిచ్చు ఏకొన్ని బిల్లులగూర్చియో తప్ప, ప్రజలకు సాధారణబిల్లులగూర్చి శ్రద్ధకలుగుట దుస్తరము. కాన వారి యామోదమునకు ప్రతిబిల్లును సమర్థించుటవలన ఇప్పటికన్నను హెచ్చుబాధ, శాసననిర్మాణము నందెదుర్కొనవలసివచ్చును. ఇప్పటికే ఏసంస్కరణనైనను, ప్రజలయందు ప్రచారితమొనర్చి ప్రజాప్రతినిధి సభయందు చర్చింపజేసి వివిధరాచకీయకక్షలవారి దృష్టికిందెచ్చి, తుదకాసభవారిచే యామోదింపజేయుసరికి అనేక వత్సరములు పట్టుచున్నది. ఇక యీశ్రమకుతోడు "రెఫరెండమును" గూడ తెచ్చిపెట్టుచో, ఇంకెన్నో వత్సరములు ఏసంస్కరణకైనను శాసనము నిర్మించుటకు పట్టును.

ఈరహస్యమును గమనించియే, 'రిఫరెండము' పద్ధతి నవలంభించిన రాజ్యాంగములన్నిటి యందును, వోటర్లందరిలో ఇరువదివ వంతుమందికాని, మరేవంతుమందికాని, ప్రజాప్రతినిధిసభవారిచే అంగీకరింపబడిన బిల్లును 'రిఫరెండము' నకు తేవలయునను నియమము చేర్పించుట కలదు. జర్మనీయందు మంత్రివర్గమువారిచే ప్రోద్బల పరచబడిన ప్రెసిడెంటుగారు, శాసనసభలచే నంగీకరింప బడిన బిల్లును రిఫరెండమునకు తీసుకొనిరావచ్చును. కాని, మంత్రివర్గమువారిచే కోరబడినబిల్లులపై నిట్టిచర్యతీసుకొనుట చాల అరుదుగా జరుగును. చెకో